Skip to main content

USEFUL SECRETS.

USEFUL SECRETS  ఉద్దేశ్యం 

 వృద్ధులైన తాత అవ్వలు వారి జీవితకాలమంతా ఎన్నో సందర్భాలలో ఎన్నెన్నో సమస్యలు అనుభవించి వాటికి పరిష్కారాలపై సరైన అవగాహన పొందియుంటారు కాబట్టి ,తమ మనవలు మనవరాళ్ల శారీరక, మానసిక మార్పులను పసిగట్టి వారితో వివరంగా మాట్లాడి సరదాగా పరిష్కారాలను తెలియజేయగలుగుతారు. కానీ నేడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమై పోతుంది. అందువలన కొత్త తరాలకు పాత తరాలు అందుబాటులో లేకుండా పోతున్నాయి. వివాహ వయసును వ్యక్తిగతంగానూ చట్టపరంగాను పెంచుకోవడం,ఆర్థికంగా బలపడిన తర్వాతనే పెళ్లి అనే షరతుల మధ్య నేటి తరాలు మగ్గిపోతున్నాయి.ఈ కారణాల వలన కొందరు తమ మనవళ్లు మనవరాళ్లను చూడకుండా వృద్ధులై చనిపోతున్నారు.అంతే కాకుండా తాతవ్వలు పిల్లలకు దూరంగా ఉండటం, నిర్లక్ష్యానికి గురి కావడం, తృణీకరించబడడం వృద్ధాశ్రమాలలో చేర్పించడం జరుగుతుంది. ఆ కారణంగా పిల్లలకు శారీరకంగా మానసికంగా కలిగే మార్పులకు ఒత్తిళ్ళకుకారణాలు గానీ పరిష్కారాలు తెలియక ఆందోళన కలిగినప్పుడు పిల్లలు ఆ విషయాల గురించి తల్లిదండ్రులను అడగలేక పోతున్నారు, పిల్లలకు, తల్లి దండ్రులు ఆ విషయాలను బోధించడం సాధ్యం కాదు. ఆ సంగతులు పిల్లలకు తాత అవ్వల ద్వారానే సులభంగా తెలుస్తాయి.ఎందుకంటే పిల్లలు వారి తాత అవ్వలతో చనువుగా నిర్మొహమాటంగా ధైర్యంగా నిస్సిగ్గుగా తమ భావాలను సమస్యలను చెప్పగలుగుతారు. కానీ, ఈరోజులలో పిల్లలకు తాతవ్వలు చెప్పాల్సిన విషయాలను చెప్పడానికి ఎవరూ లేరు. కాబట్టి, నేటి,పిల్లలు కౌమార దశలో ఎదుర్కొంటున్న శారీరక మానసిక, మార్పుల వలన కలిగే అనేక సందేహాలను నివృత్తిచేయడానికి , సమస్యలకు రిష్కారాలను అందించడానికి మాట సాయంగా ఉంటుందని ఈ బ్లాగ్ ను ప్రారంభిస్తున్నాను మీ భాగస్వామ్యంతో అనేకులకు సహాయం అందిస్తారని ఆశిస్తూ .... మీ చిదిరాల సుధాకర్

          As the elderly grandparents have experienced many problems throughout their life and have gained proper understanding of their solutions, their grandchildren are able to sense the physical and mental changes of their grandchildren and talk to them in detail and share fun solutions. But today Joint family system will be broken. Thus the old generations are becoming unavailable to the new generations. Today's generations are torn between raising the marriage age personally and legally, and marrying only after financial strength. Due to these reasons some are dying of old age without seeing their grandchildren. Moreover, grandparents are distant from children, neglected and despised Additions are made to old age homes. Because of that, children are not able to ask their parents about those things when they are worried because they do not know the causes or solutions for the physical and mental changes caused by the stress, and parents cannot teach the children those things. Those things are easily known to the children only by their grandparents. Because children are able to express their feelings and problems openly and boldly with their grandparents   But, these days, there is no one to tell children the things that grandparents need to tell them. So, I am starting this blog to clear many doubts and provide solutions to the problems caused by the physical and mental changes that today's children are facing during adolescence, hoping that with your participation it will help many.                                                                                                       .... your  Chidirala Sudhakar

Comments

Popular posts from this blog

vyasamulu

బొందల గడ్డ   ఉపోద్ఘాతం ప్రతి మనిషికి అంతిమ సంస్కారం జరపడానికి ఆప్తులు అందరూ చేరే ప్రదేశం. ఈజీవన యాత్రలో మనుషులను కడసారి చేర్చుకుని, అందరినీ సమా నంగా ఆదరించే ప్రదేశం. మనిషి యొక్క మట్టి శరీరమును మట్టికి అప్పగించే ప్రదేశం. మాటిమాటికి వాస్తవాలను విలువలను గూర్చి ఆలోచింపచేసి,వైరాగ్యాన్ని పరిచ యం చేసే ప్రదేశం.అంతరంగంలో పరివర్తన కలుగజేసి ఆత్మావలోక నాన్ని కలి గించి సంస్కారానికి పునాది వేసి సంఘ జీవనమును బలపరిచే ప్రదేశం .భవ బంధాలు తెగిపోయిన వారిని చూస్తూ విలపించే వారికి వివేకా న్నిచ్చే ప్రదేశం మత్తిళ్ళిన వారి కళ్ళను కన్నీటితో తడిపే ప్రదేశం. సత్యమును చూపించి మాయను తొలగిస్తూ పాడె కెక్కిన వారి విలువను ప్రకటించే ప్రదేశం. బంధువు లందరికీ చూపిస్తూ పూర్వీకులను జ్ఞాపకం లోకి తెచ్చే ప్రదేశం. కాకులకు పక్షులకు కుక్కలకు అప్పుడప్పుడు విందు భోజనం దొరికే ప్రదేశం . మధ్యభాగం ఊరుకు దూరంగా ఉద్విగ్న వాతావరణంలో వచ్చిపోయేవారికి వాస్తవాలను చూపిస్తూ బోధించే బొందల గడ్డకు సందర్భానుసారంగా వెళ్లి రావడం వలన వేదపండితులను సందర్శించు కున్న వారి కంటే ఎక్కువ వివేకం అందుతుంది. యాంత్రిక జీవన పోరాటంలో నైతిక విలువల ఊసే లేక...

Jeevana Jyothi

Please click the link below to access and read jeevana jyothi book                                                                     click the link below                                                                          Jeevana Jyothi
మంచె ఉపోద్ఘాతం;- సువిశాలమైన చేలుచెలుకల నడుమ పంటలను కాపాడుకోవడానికి రైతులు కర్రలతో చిన్న పంది రిని నిర్మించి దానిపై కాపలా కాస్తు కునుకు దీయడానికి అనుకూలంగా పొరక పరిచి  దానిపై వరి గడ్డి పరుస్తారు .  దానినే వారు మంచె అనిపిలుస్తారు .  ఉమ్మడికుటుంబాలలోఎదిగినమనవలు    మనవరాళ్ళు ,  వారి   స్నేహితులతోవారివారిప్రవర్తననుగమనిస్తుఅభ్యంతరకరంగాప్రవర్తిస్తేవారిబాగోతాన్నితల్లిదండ్రులకుతెలియజేసి , పిల్లలకుబుద్ధిచెప్పించేతాతలు , నానమ్మలు వారి ఇంటిలో ఓపక్కన మంచంలో పడుకొని , మంచెపై ఉన్నరైతు ,  ఎలాగైతే తన    కోత కొస్తున్నపంటను అడవి పందులు   కోతులు ,  ఎలుగు బంట్లు ,  దొంగల బారిన పడకుండ కాపాడుకుంటాడో ,  అలాగే ఆఇంటి   పెద్దలు   ఆఇంటిగౌరవంనుకాపాడటానికి    అహర్నిషలుకృషి చేస్తూనేఉంటారు . ఆరుగాలం కష్టపడే రైతులు తమ పంటను   వన్య మృగాలు ,  దొంగల నుండి   కాపాడుకోవడానికి రాత్రంతా   మంచె మీద   మెలుకువగా   ఉన్న రైతులవలె , వృద్ధులైన ఇంటి   పెద్దలు ఇరుగు పొరుగువారితో మాట్లాడుతూ , స్నేహం ...