Skip to main content

vyasamulu

బొందల గడ్డ 
ఉపోద్ఘాతం
ప్రతి మనిషికి అంతిమ సంస్కారం జరపడానికి ఆప్తులు అందరూ చేరే ప్రదేశం. ఈజీవన యాత్రలో మనుషులను కడసారి చేర్చుకుని, అందరినీ సమా నంగా ఆదరించే ప్రదేశం. మనిషి యొక్క మట్టి శరీరమును మట్టికి అప్పగించే ప్రదేశం.

మాటిమాటికి వాస్తవాలను విలువలను గూర్చి ఆలోచింపచేసి,వైరాగ్యాన్ని పరిచ యం చేసే ప్రదేశం.అంతరంగంలో పరివర్తన కలుగజేసి ఆత్మావలోక నాన్ని కలి గించి సంస్కారానికి పునాది వేసి సంఘ జీవనమును బలపరిచే ప్రదేశం .భవ బంధాలు తెగిపోయిన వారిని చూస్తూ విలపించే వారికి వివేకా న్నిచ్చే ప్రదేశం మత్తిళ్ళిన వారి కళ్ళను కన్నీటితో తడిపే ప్రదేశం. సత్యమును చూపించి మాయను తొలగిస్తూ పాడె కెక్కిన వారి విలువను ప్రకటించే ప్రదేశం. బంధువు లందరికీ చూపిస్తూ పూర్వీకులను జ్ఞాపకం లోకి తెచ్చే ప్రదేశం. కాకులకు పక్షులకు కుక్కలకు అప్పుడప్పుడు విందు భోజనం దొరికే ప్రదేశం .

మధ్యభాగం

ఊరుకు దూరంగా ఉద్విగ్న వాతావరణంలో వచ్చిపోయేవారికి వాస్తవాలను చూపిస్తూ బోధించే బొందల గడ్డకు సందర్భానుసారంగా వెళ్లి రావడం వలన వేదపండితులను సందర్శించు కున్న వారి కంటే ఎక్కువ వివేకం అందుతుంది.

యాంత్రిక జీవన పోరాటంలో

నైతిక విలువల ఊసే లేక

మంచికి చెడ్డకు మధ్యన నిలిచి

తోచినట్లుగా దూసుకుపోయే

సహవాసలతో సఖ్యత లేని

మానవత్వమును మట్టుపెట్టిన

సాంఘిక రోగుల చికిత్స కొరకు

బొందల గడ్డను దర్శించాలి

మానవ జన్మ గొప్పదని వివేచనా జ్ఞానం కలిగి భూత,వర్తమాన, భవిష్యత్తు కాలా లను దృష్టిలో పెట్టుకొని తన సహజాత ప్రవృత్తిని అధిగమిస్తూ కుటుంబ మరియు సామాజిక జీవన పదంలో నైతిక విలువలు కలిగి జీవించడం వల్లనే మానవ జన్మకు సృష్టిలో ఉత్కృష్టమైన స్థానం ఉందని గ్రహించినా, స్వార్థం పెరిగి మంచి ఏదో చెడు ఏదో ఆలోచి మంచి చన చేయక తన అవ సరాలను తీర్చుకోవడం కోసం ఎంతకైనా దిగజారే ప్రవృత్తిని కలిగి ఇతరుల పట్ల నీచంగా ప్రవర్తించి, సామాజిక జీవితమును దుర్భరంగా మారుస్తున్నారు.ఇలాంటి వారి వంకర బుద్ధిని చక్కదిద్దడం ఎవరి వల్ల కాదు.చచ్చిపోయి బొందల గడ్డకు చేరిన తమలాంటి నీచులకు లభించే తిరస్కార భావాలను గూర్చి ప్రత్యక్షంగా చూడడం,వినడంతోనీచులు తమలోని నీచ ప్రవృత్తిని కాస్తంత అదుపులో పెట్టుకోగలరు .

బతుకు బాటలో బుద్ధులు దిద్దే

మనవల చెవిలో మర్మాలూదే

ఇంటి పెద్దలను ఒంటిగ విడిచి

కడుపున పుట్టిన కొడుకుల బిడ్డల

చదువుల సంతల సామ్రాజ్యంలో

యాంత్రిక జీవన సారథ్యంలో

విలువలు లేని విద్యను నేర్పే

సభ్య సమాజపు సంగతి మరిచి

జన్మభూమి కి గుడ్ బై చెప్పే

సంపద సంపద సంపద అంటూ

సంద్రము దాటి వలసలు పోయే

స్వార్థపరుల గురి మార్చుట కొరకు

బొందల గడ్డ దర్శించాలి

జీవితమంటే ఆస్తులు సంపాదించడం కాదు అనుభవాలను పొందడం. ఆత్మీయులను సంపా దించు కోవడం అనే స్పృహ కలిగించే వారుగా పెద్దలు గురువులు పిల్లలకు మార్గ నిర్దేశకులుగా ఉండాలి . కానీ,అవినీతిపరుల అట్టహాసమును బట్టి సమాజం ధనానికి విలువలు ఆపాదిస్తూ , ధనమే దైవం అన్నట్లుగా బ్రతుకుతున్నారు .

తెలివిగలవారు సమాజమును ఒక గ్రంథాలయం గాను సహవాసుల అనుభవాలను పాఠాలుగా మార్చుకొని తన జీవిత గమనాన్ని సరి చేసుకుంటారు కానీ తెలివి లేని వారికి ఆధ్యాత్మిక అంశాలను బోధించేవారు గాని తమ జీవిత గమనాన్ని చక్కదిద్దే వారు గాని లేని వారికి క్రూర మృగంలా తిరుగులాడే వారికి కూడా హితోపదేశం చేసేదిగా బొందల గడ్డ ఉంటుంది .కులం మతం లింగభేదము, ఏ భేదము లేకుండా జ్ఞానోదయం కలిగిస్తుంది కాబట్టి మనిషి, స్వార్థపు ఆలోచన నుండి బయటపడి సభ్య సమాజానికి సహకరించి ఆత్మీయుడిగా ఎదిగి కీర్తి గడించ గలడు.

సాంఘిక జీవన సారం లేని

చిన్న కుటుంబం చిరంజీవి లకు

ఉరుములు చెప్పని గుసగుస లెరుగని

సహనం తెలియని, సఖ్యత లేని

సహవాసంలో సర్దుకుపోయే

సముద్రమైన ఈదే వారు

సంసారంలో సమస్యలు వస్తే

సర్దుకుపోయే సహనం లేక

సంసారంలో సరిగమలు లేక

సహవాసానికి బై బై చెప్పి

ఊహలకందని పరిణామాలకు

ఉ ద్వే గానికి గురైన జంటలు

అంతరంగముల నెరిగేదెవరు

ఏకం చేసే నేర్పరులెవరు

ఆప్యాయతలను పంచుట నేర్పే

అవ్వల తాతల చెలిమిని పాపిన

తల్లిదండ్రులకు తప్పని తిప్పలు

ఊహకు తండ్రి ఉపమానాలను

ఉజ్వల భవితకు సోపానాలను

సరసోక్తులతో సంస్కారాన్ని

సంసారంలో సరిగమపదని

వివరించ గల వీలుంటుందా ?

తల్లిదండ్రులు వారి పిల్లల సంసార జీవితంలో భార్యాభర్తల విభిన్న మనస్తత్వాలు అవ గాహన లోపాలు అనుమానాలను చక్కదిద్ద గలరా ? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఏ పుస్తకంలో దొరకదు.సమాజంలో జరిగే కృత్యాలకు మూలాలను తెలుసుకొని మనం మన జీవితంలో తెలిసీ తెలియని తనముతో తీసుకునే నిర్ణయాలు వాటి ఫలితాలు తీవ్రతను గుర్తించాలంటే ఉద్వేగంతో ఏడ్చేవారు వల్లిస్తూ, తలపోస్తూ ఏడ్చే ఏడుపును ఆలకిస్తే గాని, మనుషులు వారి మనసులు మాయలు మర్మాలు బంధాలు, బంధువులు ఆప్తుల అంతరంగాలు కుట్రలు కుతంత్రాలు అలవాట్లు వ్యసనాలు వాటి తీవ్రత అకృత్యాలు వాటి పూర్వపరాలు వాటి మూలాలు ఇవన్నీ బోధపడతాయి

బయటకు కనబడే ప్రపంచం,యదార్ధ ప్రపంచం మధ్య వివేచనతో ఆలోచించడం అలవాటు చేసుకుంటారు జీవిత సత్యాలను తెలుసుకుంటారు మంచివారికి దక్కిన మర్యాదను, తానూ పొందడం కోసం ఉత్తమంగా జీవించే ప్రయత్నం చేస్తారు.తద్వారా సమాజంలో అవినీతి తగ్గుతుంది.

పాలు తాగే పిల్లలు మానసిక వికలాంగులు వృద్ధాప్యంలో ఉండి నడవలేని వారు మరియు హృద్రోగులను బొందల గడ్డ కు తీసుకుని రావడం వలన ఎలాంటి ఫలితం ఉండదు. పైగా కుంత నష్టమే కలుగుతుంది.

ముగింపు

గతితప్పిన మానవ జీవనక్రమంలో భయపడాల్సినవాటిని భయం లేకుండా చేస్తూ,భయపడకూడని వాటికిభయపడుతున్నారు.తప్పు చేయకూడదని అందరికీ తెలిసినా నీతి మంతులుగా బతికే నిష్ఠ లేక కొందరు నీచంగా ప్రవర్తిస్తున్నారు.

పూర్వీకుల సమాధులను చూస్తున్నప్పుడు వారితో వీరికి ఉన్న అనుబంధాలు జ్ఞాపకము లోకి వచ్చి కుప్ప కూలిపోయి ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఒంటరిగా బొందల గడ్డ కు వెళ్ళకూడదు అని చెబుతారు. కానీ,బడికి వెళ్లే వయసు నుండి పెద్దల దాకా అందరూ తప్పనిసరిగా అంతిమ సంస్కారాలకు బొందల గడ్డను దర్శించుకోవడం వలన నీ హృద య కాఠిన్యం తొలిగి,సహచరుల మధ్యలో అనురాగం ఆప్యాయతలు పెరిగి సామాజిక జీవ నమునకు సహాయకారిగా ఉండగలదు. తద్వారా సమాజంలో అవినీతి తగ్గి తమ సహచ రుల ఆత్మీయుల ఆదరణలో తమ కష్ట నష్టాలను మరిచి ఆనందంగా జీవించగలరు.

Comments

Popular posts from this blog

Jeevana Jyothi

Please click the link below to access and read jeevana jyothi book                                                                     click the link below                                                                          Jeevana Jyothi
మంచె ఉపోద్ఘాతం;- సువిశాలమైన చేలుచెలుకల నడుమ పంటలను కాపాడుకోవడానికి రైతులు కర్రలతో చిన్న పంది రిని నిర్మించి దానిపై కాపలా కాస్తు కునుకు దీయడానికి అనుకూలంగా పొరక పరిచి  దానిపై వరి గడ్డి పరుస్తారు .  దానినే వారు మంచె అనిపిలుస్తారు .  ఉమ్మడికుటుంబాలలోఎదిగినమనవలు    మనవరాళ్ళు ,  వారి   స్నేహితులతోవారివారిప్రవర్తననుగమనిస్తుఅభ్యంతరకరంగాప్రవర్తిస్తేవారిబాగోతాన్నితల్లిదండ్రులకుతెలియజేసి , పిల్లలకుబుద్ధిచెప్పించేతాతలు , నానమ్మలు వారి ఇంటిలో ఓపక్కన మంచంలో పడుకొని , మంచెపై ఉన్నరైతు ,  ఎలాగైతే తన    కోత కొస్తున్నపంటను అడవి పందులు   కోతులు ,  ఎలుగు బంట్లు ,  దొంగల బారిన పడకుండ కాపాడుకుంటాడో ,  అలాగే ఆఇంటి   పెద్దలు   ఆఇంటిగౌరవంనుకాపాడటానికి    అహర్నిషలుకృషి చేస్తూనేఉంటారు . ఆరుగాలం కష్టపడే రైతులు తమ పంటను   వన్య మృగాలు ,  దొంగల నుండి   కాపాడుకోవడానికి రాత్రంతా   మంచె మీద   మెలుకువగా   ఉన్న రైతులవలె , వృద్ధులైన ఇంటి   పెద్దలు ఇరుగు పొరుగువారితో మాట్లాడుతూ , స్నేహం ...