గౌరవనీయులైన పెద్దలు శ్రేయోభిలాషులకు నమస్కారం,,
మీ అనుభవజ్ఞానంతో నేటి సమస్యపై 100 పదాలకు మించకుండా సమాధానం రాసి మాట సహాయం చేస్తారని ఆశిస్తున్నాను
సమస్య:-- ఒక అమ్మాయి మగరాయుడుగా మారడానికి కారణాలు ఏమిటి?
Respected Elders Greetings to all well-wishers,
I hope you can help me by writing an answer of not more than 100 words on today's problem with your experience.
Problem:-- What are the reasons why a girl becomes a boy?
వృద్ధులైన తాత అవ్వలు వారి జీవిత కాలమంతా ఎన్నో సందర్భాలలో ఎన్నెన్నో సమస్యలు అనుభవించి వాటికి పరిష్కారాలపై సరైన అవగాహన పొందియుంటారు కాబట్టి, తమ మనవలు మనవరాళ్ల శారీరక, మానసిక మార్పులను పసిగట్టి వారితో వివరంగా మాట్లాడి సరదాగా పరిష్కారాలను తెలియజేయ గలుగుతారు.
కానీ నేడు
ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమై పోతుంది. అందువలన కొత్త తరాలకు పాత తరాలు అందుబాటులో లేకుండా పోతున్నాయి.
వివాహ వయసును వ్యక్తిగతంగానూ చట్టపరంగాను పెంచుకోవడం,ఆర్థికంగా బలపడిన తర్వాతనే పెళ్లి అనే షరతుల మధ్య నేటి తరాలు మగ్గిపోతున్నాయి. ఈ కారణాల వలన కొందరు తమ మనవళ్లు మనవరాళ్లను చూడకుండా వృద్ధులై చనిపోతున్నారు.
అంతేకాకుండా తాతవ్వలు పిల్లలకు దూరంగా ఉండటం,నిర్లక్ష్యానికి గురి కావడం, తృణీకరించబడడం
వృద్ధాశ్రమాలలో చేర్పించడం జరుగుతుంది.
ఆ కారణంగా పిల్లలకు శారీరకంగా మానసికంగా కలిగే మార్పులకు ఒత్తిళ్ళకు కారణాలు గానీ, పరిష్కారాలు గాని తెలియక ఆందోళన కలిగినప్పుడు పిల్లలు ఆ విషయాల గురించి తల్లిదండ్రులను అడగలేక పోతున్నారు , తల్లిదండ్రులు ఆ విషయాలను పిల్లలకు బోధించడం సాధ్యం కాదు. ఆ సంగతులు పిల్లలకు తాత అవ్వల ద్వారానే సులభంగా తెలుస్తాయి. ఎందుకంటే పిల్లలు వారి తాత అవ్వలతో చనువుగా నిర్మొహమాటంగా ధైర్యంగా నిస్సిగ్గుగా తమ భావాలను, సమస్యలను చెప్పగలుగుతారు. కానీ, ఈరోజులలో పిల్లలకు తాతవ్వలు చెప్పాల్సిన విషయాలను చెప్పడానికి ఎవరూ లేరు. కాబట్టి, నేటి పిల్లలు కౌమార దశలో ఎదుర్కొంటున్న శారీరక మానసిక మార్పుల వలన కలిగే అనేక సందేహాలను నివృత్తి చేయడానికి, సమస్యలకు పరిష్కారాలను అందించ డానికి మాట సాయంగా ఉంటుందని ఈ బ్లాగ్ ను ప్రారంభిస్తున్నాను మీ భాగస్వామ్యంతో అనేకులకు సహాయం అందిస్తారని ఆశిస్తూ
.... మీ చిదిరాల సుధాకర్
Comments
Post a Comment