Skip to main content


మంచె

ఉపోద్ఘాతం;-

సువిశాలమైన చేలుచెలుకల నడుమ పంటలను కాపాడుకోవడానికి రైతులు కర్రలతో చిన్న పంది రిని నిర్మించి దానిపై కాపలా కాస్తు కునుకు దీయడానికి అనుకూలంగా పొరక పరిచి  దానిపై వరి గడ్డి పరుస్తారు. దానినే వారు మంచె అనిపిలుస్తారు. ఉమ్మడికుటుంబాలలోఎదిగినమనవలు  మనవరాళ్ళు, వారి స్నేహితులతోవారివారిప్రవర్తననుగమనిస్తుఅభ్యంతరకరంగాప్రవర్తిస్తేవారిబాగోతాన్నితల్లిదండ్రులకుతెలియజేసి,పిల్లలకుబుద్ధిచెప్పించేతాతలు,నానమ్మలు వారి ఇంటిలో ఓపక్కన మంచంలో పడుకొని,మంచెపై ఉన్నరైతు, ఎలాగైతే తన  కోత కొస్తున్నపంటను అడవి పందులు కోతులు, ఎలుగు బంట్లు, దొంగల బారిన పడకుండ కాపాడుకుంటాడో, అలాగే ఆఇంటి  పెద్దలు ఆఇంటిగౌరవంనుకాపాడటానికి  అహర్నిషలుకృషిచేస్తూనేఉంటారు.ఆరుగాలం కష్టపడే రైతులు తమ పంటను వన్య మృగాలు, దొంగల నుండి కాపాడుకోవడానికి రాత్రంతా మంచె మీద మెలుకువగా ఉన్న రైతులవలె,వృద్ధులైన ఇంటి పెద్దలు ఇరుగు పొరుగువారితో మాట్లాడుతూ,స్నేహం పేరుతో తమ పిల్లలతో ఇంటికి  వచ్చి పోయే వారివివరాలనుఆరాతీస్తూ, అనుభవజ్ఞానం కలిగినవారై  పిల్లలకు స్నేహితులతో మునుముందురానున్నముప్పునుముందుగానేగ్రహించి,వారిపిల్లలనుతగు రీతిలో  హెచ్చరిస్తారు. ఒక రైతు తన ఇరుగు  పొరుగురైతులతో మాట్లాడుతూ,  వన్యమృగాల  అలజడి వినబడితే కేకలు పెడు తూ, చప్పుడు చేస్తూ వాటిని పారదోలేందుకు టార్చిలైట్నువాటివైపు తిప్పుతూ వాటిని భయపెడు తారు.ఏమాత్రం అలికిడి వినబడినా కునుకు నుండి తేరుకొని తన చెలుకనంతా కలియచూస్తా రు అనుకూలపరిస్థితిలో తమ పొరుగువారి చెలుకలోకి కూడాచూసి ఏవైనా జంతువులు చేలు మే స్తుంటే ఆవిషయాన్నిపొరుగు రైతులకుచేరవేసివారికిసహక రించునట్లు, మన ఇంటి పెద్దలు ఇరుగు పొరు గు వారిపిల్లల ప్రవర్తనలోని మంచి చెడ్డలను గూర్చి వారి తల్లిదండ్రులకు తెలియజేసివారికి శ్రేయోభీలాషులుగా ఉంటారు.

మధ్యభాగం;-

పూతకొచ్చిన దశనుంచే రైతులు తమపంటపై ప్రత్యేకశ్రద్ధపెట్టి,దానిలోటుపాట్లను పరిశీలిస్తూ తగిన మెలకువలు పాటించినట్లు, యవ్వనదశకు చేరుకున్న తమ పిల్లల అరోగ్యం,అలవాట్లు,స్నేహితు లు, మొ'' అంశాలపై శ్రద్ధచూపుతూ, సమాజం యొక్క దుష్ప్రభావం వారి  పిల్లలపై పడకుండ జాగ్ర త్తలు తీసుకుంటారు.
ఉమ్మడి కుటుంబంలోని వృద్దులు,ఎదుగుచున్న పిల్లలకట్టుబాట్లు, వస్త్రధారణ విధానంలోనిలోపా లను సరిదిద్దే ప్రయత్నంచేస్తారు.స్నేహితులతో వ్యవహారశైలిలోని దోషభరిత ప్రవర్తనను సరిదౌద్దే ప్రయత్నం చేస్తారు. మొక్కల ఎదుగుదలలో లోపాలేమైనా ఉన్నాయా అని తెలివైన రైతుపరిశీలిం చినట్లుగా, తెలివైన తల్లిదండ్రులు తమ ఎదిగే పిల్లల విషయం పై తగు శ్రద్ధ చూపుతారు.కొందరు  రైతులు విత్తనాలు చల్లి మొక్కలు ఎదిగీఎదగకముందే నిర్లక్ష్యంగాఉంటారు. రక్షణ చర్యలు చేపట్ట ని వారిపంటలో వన్యమృగాలు చొరబడి రోజు రోజు పంటను పాడుచేసినట్లు, దురలవాట్లు కలిగిన వారు స్నేహితులుగా ఇంటికి వచ్చినపుడు తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తే వారి పిల్లల భవి ష్యత్ పాడై పోతుంది.
చేసిన కష్టం వృధా అవడాన్ని చూసి దిగులుచెందే రైతును చూసితోటి రైతులు, నిర్లక్ష్యవైఖరిని బట్టి నష్టపోయిన రైతును మందలించినట్లు,చెడిపోయిన పిల్లలను చూసి సమాజం తల్లిదండ్రు లను అసహ్యించుకుంటుంది. తగినసమయంలో అప్రమత్తులైన రైతులు తన పంటపై ప్రత్యేక శ్రద్ధపెట్టి, మేలైన పంటను పండించి సమాజంలో గౌరవం పొందినట్లు, అప్రమత్తులైన తల్లిదండ్రు లు తమఎదిగే పిల్లలపై ప్రత్యేకశ్రద్ధ పెట్టి వారి శారీరక, మానసిక పరిస్థితులను మెరుగుపరుస్తూ వా రిభవిష్యత్ను గొప్పగా తీర్చిదిద్ధుతారు సమాజంలో తమ గౌరవంను పెంపొందించుకుంటారు. మంచెపై నుండి పంటలను పరిశీలిస్తూ, ముందు చూపుతో తగిన జాగ్రత్తలు పాటించి మెరుగైన పంటలుపండించాల్సిన రైతులు నిర్లక్ష్యంతో మంచెలనుఏర్పాటు చేయకుండా తమ పంటల రక్షణకై ప్రత్యేక శ్రద్ధచూపకుండ నష్టపోతున్నట్లుగా, నేటి తల్లిదండ్రులు పిల్లలు స్నేహం ముసు గులో చెడిపోతున్న వైనాన్ని, దిగజారుడు స్వభావంను అదుపు చేయలేని నిస్సహాయులై పోతు న్నారు. దీనికికారణం,ఓఇంటికోడలు తనఅత్తమామలకు సేవచేయవలసిన బాధ్యతలను బాని సత్వంగా భావించి పోరుపెట్టి వేరు కాపురం పెట్టించడం,ఆ తర్వాత తమకు కలిగే సంతానంను ప్రేమించే మార్గ నిర్దేశకులుగాని, శ్రేయోభిలాషులుగాని ఎవరూలేని పిల్లలుకూడా నైతిక విలువలు వాటిప్రాధాన్యత ఒంటబట్టక,ఆనందాన్నివ్యసనాలలోవెతుకుతున్నారు. తాము చేసేది తప్పని తెలిసే లోపు వారి జీవితం చేజారి పోతోంది. అందుకే పూర్వీకులు తమపిల్లలపిల్లలకు ఆప్యాతాను రాగాలనుపంచి పరిపా లించే ఇంటి పెద్దలున్న ఇంటికే తమకూతురినికోడలుగాపంపేవారుఅత్త మామలు ఉంటేనే తమ కూతురును తమ కూతురి పిల్లలకు మార్గదర్శకులుగా ఉంటారని వారి నమ్మకం.కానీ,ఈరోజులలోఉద్యోగం ఉంటే చాలునని, మిగతా విషయాలలో పట్టింపు లేకుండా సం బంధం కలుపుకుంటున్నారు. తద్వారా జీవితం, దాని విలువలపై అవగాహనలేనివారు మానవ సంబంధాలు,ప్రేమఅనురాగంఆప్యాయతలఅనుభూతులనుఎరగనివారై,ఎలాప్రవర్తించినా అడి గేవారు లేని అనాధలుగా బతుకు తున్నారు.
కొందరువయోవృద్ధులైనప్పటికీఅనుభవజ్ఞానం లేనివారుగా ఉంటారు.అలాంటివారిని మంచెపై కెక్కించడంవలన ఎలాంటి ఫలితం ఉండదు. అలాగే వ్యసనపరులను కూడా మంచెకాడికి పంప డం సరికాదు. ఎందుకంటే వ్యసనపరులు తమమత్తులో విచక్షణాజ్ఞానంను కోల్పోయినవారై విప రీతాలను చూస్తున్నట్లు భ్రమపడి అనవసరంగా అలజడి సృష్టించి, ఇరుగు పొరుగువారితో దూషిం చబడినట్లు,పిల్లలనైతికప్రవర్తన విషయంలో తాగుబోతుల అల్లరివల్ల ఆకుటుంబ గౌరవం తగ్గిపో యే ప్రమాదంఉంది. కాబట్టి అనుభవజ్ఞానంలేని వారిని గాని,వ్యసనపరులుగాని, పిల్లల విషయంలో చెప్పేతప్పుడు ఆరోపణలను గుడ్డిగా నమ్మకూడదు.

ముగింపు;- మెలకువకలిగిఅప్రమత్తంగాఉండేవారినిమంచెకాడికిపంపించినట్లు ఇంటిపెద్దలైన వారి లో అనుభవంగల వారిని మరియు పర్యవేక్షణ జ్ఞానం కలవారిని మాత్రమే ఆఇంటి పిల్లల విషయా లపై దృష్టిపెట్టుటకు అనుమతించాలి. తమ పంటను కాపాడుకోలేని తెలివిలేని రైతులు తీవ్రమైన నష్టానికి గురియై ఆత్మహత్యలకు పాల్పడినట్లుగా తమ పిల్లల ప్రవర్తనపై నిర్లక్ష్యంగా వ్యవహరించినవారు,వారినిర్లక్ష్యంనకుపర్యవసానంగాసమాజంలోగౌరవంనుకోల్పోయినవారైఆత్మాభిమానంనుచంపుకునిజీవశ్చవంలాబతుకుతారు.ఈస్థితిలోఆత్మాభిమానంనుచంపుకోలేనివారుఆత్మహత్యలకు పాల్పడుతారు. ఇదంతా సోమరితనం,ముందు చూపులేనిపనులు మరియు క్రమమై న జీవిత లక్ష్యా లను ఏర్పరచుకోలేని బుద్ధిమాంద్యం వలన కలిగిన ఫలితంగా గుర్తించబడుతుం ది. కాబట్టి ప్రతి ఒక్కరు మొదటినుంచే ముందుచూపుతో చైతన్యం కలిగి క్రమమైన జీవితలక్ష్యాలను ఏర్పరచుకో వాలి.వాటి సాధనకునిరంతరంకృషిచేయాలి.తద్వారామనకలలపంటపండుతుంది. జీవితం ఆనంద మయమౌతుంది.


Comments

Popular posts from this blog

vyasamulu

బొందల గడ్డ   ఉపోద్ఘాతం ప్రతి మనిషికి అంతిమ సంస్కారం జరపడానికి ఆప్తులు అందరూ చేరే ప్రదేశం. ఈజీవన యాత్రలో మనుషులను కడసారి చేర్చుకుని, అందరినీ సమా నంగా ఆదరించే ప్రదేశం. మనిషి యొక్క మట్టి శరీరమును మట్టికి అప్పగించే ప్రదేశం. మాటిమాటికి వాస్తవాలను విలువలను గూర్చి ఆలోచింపచేసి,వైరాగ్యాన్ని పరిచ యం చేసే ప్రదేశం.అంతరంగంలో పరివర్తన కలుగజేసి ఆత్మావలోక నాన్ని కలి గించి సంస్కారానికి పునాది వేసి సంఘ జీవనమును బలపరిచే ప్రదేశం .భవ బంధాలు తెగిపోయిన వారిని చూస్తూ విలపించే వారికి వివేకా న్నిచ్చే ప్రదేశం మత్తిళ్ళిన వారి కళ్ళను కన్నీటితో తడిపే ప్రదేశం. సత్యమును చూపించి మాయను తొలగిస్తూ పాడె కెక్కిన వారి విలువను ప్రకటించే ప్రదేశం. బంధువు లందరికీ చూపిస్తూ పూర్వీకులను జ్ఞాపకం లోకి తెచ్చే ప్రదేశం. కాకులకు పక్షులకు కుక్కలకు అప్పుడప్పుడు విందు భోజనం దొరికే ప్రదేశం . మధ్యభాగం ఊరుకు దూరంగా ఉద్విగ్న వాతావరణంలో వచ్చిపోయేవారికి వాస్తవాలను చూపిస్తూ బోధించే బొందల గడ్డకు సందర్భానుసారంగా వెళ్లి రావడం వలన వేదపండితులను సందర్శించు కున్న వారి కంటే ఎక్కువ వివేకం అందుతుంది. యాంత్రిక జీవన పోరాటంలో నైతిక విలువల ఊసే లేక...

Jeevana Jyothi

Please click the link below to access and read jeevana jyothi book                                                                     click the link below                                                                          Jeevana Jyothi